ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తే ఒక మ్యాజిక్ లా ఉంటుంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ స్టార్ హీరోకి ఉన్న పాపులారిటీ దక్కించుకున్నాడు. ముఖ్యంగా విజయ్ తన యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ కొన్ని సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఇటీవల లైగర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే పూరి జగన్నాథ్ చార్మి తదితరులు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న విజయ్ దేవరకొండ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి స్పందించిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఒక వేళ తారక్ అన్న ఆస్కార్ గెలిస్తే ఆయన అభిమానులు మెంటలెక్కిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు.

ఒక వేళ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు మన దేశానికి ఆస్కార్ వస్తే ఆ హైప్ వేరుగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ అవార్డు దక్కితే ఒక మ్యాజిక్ లాగా చాలా బావుంటుంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే విజయ్, పూరీ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది . ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.