“అవతార్ 2” ప్లాప్ అయితే..అసలు ఈ మాట ఎందుకు వచ్చినట్టు?

డెఫినెట్ గా వరల్డ్ వైడ్ సినిమా ని షేక్ చేసే సినిమా ఇపుడు అవతార్ 2 అని అందరికీ తెలిసిందే. ట్రైలర్ వచ్చాక కూడా సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా ఆల్రెడీ ఈ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరాన్ మొత్తం ఐదు సినిమాల ఫ్రాంచైజ్ గా దీనిని ప్లాన్ చేసుకున్నారు.

అయితే నెక్స్ట్ అవతార్ 2 తోనే 3, 4 చిత్రాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే కామెరాన్ కెరీర్ లో ప్లాప్ అనే మాట పెద్దగా లేదు. కానీ ఎందుకో ఇపుడు అవతార్ 2 విషయంలో “ప్లాప్ అయితే” అనే మాట దర్శకుడి నుంచి బయటకి రావడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

తాము ప్లాన్ చేసిన సిరీస్ అయితే ఇప్పుడు అవతార్ 2 ఫలితం మీదనే ఆధారపడి ఉన్నాయని. ఒకవేళ అవతార్ 2 కానీ ప్లాప్ అయితే మాత్రం తమ నుంచి నెక్స్ట్ 4,5 పార్టులు రావని స్వయంగా కామెరాన్ ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పడం వైరల్ గా మారింది.

దీనితో తాను సినిమా పట్ల కాన్ఫిడెంట్ గా లేడా? ఇక అవతార్ మూడు భాగలేనా అంటూ గట్టిగా వినిపిస్తుంది. అయితే ట్రైలర్ తో మాత్రం మంచి నమ్మకాన్నే కెమెరాన్ మళ్ళీ అందించాడు. బాక్సాఫీస్ దగ్గర అయితే ప్రేక్షకులు ఈ సినిమాకి ఎలాంటి స్వాగతం ఇస్తారో అనేది ఈ డిసెంబర్ 16 వరకు వేచి చూడాల్సిందే.