“ఢీ” స్టేజ్ పై బన్నీ..ముందు ఏ హీరోని పిలవాలనుకున్నారో తెలుసా?

తెలుగు స్మాల్ స్క్రీన్ పై పెద్ద రియాలిటీ షో అందులోని తెలుగు లో సూపర్ హిట్ అయినటువంటి డాన్స్ షో “ఢీ” అని చెప్పాలి. అయితే ఈ షో ఇప్పుడు విజయవంతంగా పూర్తి 13వ సీజన్ ని కూడా పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈ షో ఫైనల్ ఎపిసోడ్ కి గాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ప్రత్యేక అతిధిగా పిలవబోతున్నారని ఎప్పుడో మేము వెల్లడి చేసాం. అయితే ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ స్టైలిష్ పుష్ప రాజ్ ఢీ స్టేజ్ పైకి వచ్చాడు.

అయితే ఇప్పుడు మీకోసం ఇంకో ఇంట్రెస్టింగ్ సమాచారం తీసుకొచ్చాం. ఈ షో ఫైనల్స్ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ కనుక రాకుండా ఉంటే ఇంకో బిగ్ స్టార్ వచ్చి ఉండేవాడట. అతడు మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ నే. బాలయ్యని కూడా ఈ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా పిలవాలి అనుకున్నారట. ఒకవేళ బన్నీ కానీ అప్పుడు ఒప్పుకోక ఉంటే బాలయ్య రాకతో మరింత పవర్ ఫుల్ గా స్టేజ్ సెట్టయ్యి ఉండేది.