కూతురికి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉన్న ఐకాన్ స్టార్.. ఫోటో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మంచి హిట్ అందుకొని ప్రస్తుతం హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి మరి కాస్త సమయం పట్టడంతో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ కుటుంబం మొత్తం కలిసి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వెరీ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్నేహారెడ్డి అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా స్నేహ తన భర్త అల్లు అర్జున్ కూతురు అర్హ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటోలో అల్లు అర్హ రెస్టారెంట్ లో అల్లరి చేస్తూ ఉండగా బన్నీ మాత్రం ఎంతో ప్రేమగా తన కూతురికి గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నారు.ఇలా అల్లు అర్జున్ తన కూతురు పై ఉన్న ప్రేమను వ్యక్తపరచడంతో ఈ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక అర్హ చేసే అల్లరి చిలిపి పనులు గురించి మనకు తెలిసిందే.

ఇంత చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ ఉన్నటువంటి అర్హ ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో అర్హ భరతుడి పాత్రలో నటించారు.ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి మరి కాస్తా సమయం పట్టేలా ఉంది. అందుకే తన కుటుంబంతో కలిసి లండన్ హాలిడే ట్రిప్ వెళ్లి కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు.