Allu Arjun: గత కొంతకాలంగా అల్లు అర్జున్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా 2024 ఎన్నికల సమయం నుంచి ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అల్లు అర్జున్ వైసీపీ తరఫున నంద్యాలలో ప్రచార కార్యక్రమాలు చేసినప్పటి నుంచి ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై అల్లు అర్జున్ స్పందించలేదు. పుష్ప 2ప్రమోషన్స్ లో ఈ విషయంపై స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ బన్నీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇది ఇలా ఉంటే ఈ వార్తలు గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తుండడంతో తాజాగా ఈ రూమర్స్ పై అల్లు అర్జున్ టీమ్స్ స్పందించింది.
ఈ మేరకు అల్లు అర్జున్ టీం ఈ విషయంపై స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు వార్తలే, అందులో ఎంత మాత్రం నిజం లేదు, దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని మీడియా సంస్థలతో పాటు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నట్లుగా బన్నీ టీం తెలిపింది. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ వస్తున్నారు అన్న వార్తలు పూర్తిగా అబద్దం. ఇలాంటి నిరాధారమైన వాటి పట్ల జాగ్రత్తతో ఉండాలని స్పష్టం చేస్తున్నాం. ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మీడియా సంస్థలు, వ్యక్తులను కోరుతున్నాము. ఇలాంటివి ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా అప్‌డేట్ ఇస్తాం. అని అల్లు అర్జున్ టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఎప్పటినుంచో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే..
అల్లు అర్జున్ తాజాగా నటించిన పుష్ప 2 సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా ప్రచారం అవుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ మూవీ రూ.1002 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. కాగా ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు విడుదలైన ఏ సినిమా కూడా ఈ రికార్డును సాధించలేకపోయింది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అన్నది ఇదే తొలిసారి. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి.