Crime News: భర్త రోజూ తాగొచ్చి హింసిస్తున్నాడు అని ఆ భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..!

Crime News: ప్రస్తుత కాలంలో చాలా మంది మద్యపానం సిగరెట్లు వంటి చెడు అలవాట్లకు బాగా అలవాటు పడి వాటికి బానిసలుగా మారుతున్నారు. ఈ అలవాట్ల వల్ల వారి అనారోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం మద్యం మత్తులో మృగంలా ప్రవర్తిస్తూ కుటుంబ సభ్యులను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. తాజాగా ఇలాంటి సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… రోజూ తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్నారని ఆ భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు సమీపంలోని నాగర్‌కు చెందిన జితేంద్ర, దీప దంపతులకు12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మద్యానికి బాగా అలవాటు పడిన జితేంద్ర రోజు తాగొచ్చి భార్యను, పిల్లలను హింసించేవాడు. అంతటితో ఆగకుండా పిల్లల ఎదురుగానే శృంగారం చేయాలంటూ భార్యను చిత్రహింసలకు గురి చేసే వాడు.

ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన కూడా జితేంద్ర కాబట్టి భార్య పిల్లలను కొట్టి హింసించాడు.భర్త ప్రవర్తన తో విసుగు చెందిన దీపక్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.కానీ తాను చనిపోతే తన పిల్లలు అనాధలుగా మారుతారని భావించి ఎలాగైనా తన భర్త పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. రాత్రి తన భర్త తినే భోజనంలో నిద్రమాత్రలు కలిపి తన భర్తకు భోజనం వడ్డించింది. అర్ధరాత్రి తన భర్త గాఢనిద్రలోకి వెళ్లిన తర్వాత కత్తి తీసుకుని గొంతు కోసి భర్తని హత్య చేసింది. తర్వాతి రోజు ఉదయం పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను హత్య చేసినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు లొంగి పోయింది.