Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె కట్టు బొట్టు. ఎప్పుడూ సాంప్రదాయ పద్ధతిగా, నిండుగా దుస్తులు ధరించి చూడటానికి అచ్చతెలుగు తెలుగింటి ఆడపిల్లల కనిపిస్తూ ఉంటుంది. ఇక సినిమాలలో కూడా ఈమె రొమాన్స్ సన్నివేశాల్లో నటించదు. ముద్దు సీన్ లలో నటించదు అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఆమె అనవసరమైన వివాదాల్లోకి దూరి కామెంట్స్ చేయడం లాంటివి కూడా చేయలేదు. అయితే ఎప్పుడూ పద్ధతిగా కనిపిస్తూ సింపుల్ గా కనిపించే అనుపమ తాజాగా నటించిన సినిమాలో రెచ్చిపోయి నటించింది అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
అయితే అనుపమ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఒక్క సినిమాలో కూడా ఆమె అందాన్ని ఆరబోయడం కానీ, ముద్దు సీన్లలో నటించడం కానీ చేయలేదు. కానీ మొదటిసారిగా ఆమె బోల్డ్ గా నటించింది. ఇటీవలే అనుపమ హీరోయిన్ గా నటించిన రౌడీ బాయ్స్ సినిమా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. అనుపమ మొదటిసారిగా ఆ సినిమాలో బోల్డ్ గా నటించడమే కాకుండా, పోటీపడి మరీ లిప్ కిస్ లు పెట్టి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇందులోని ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు చూసి అనుపమ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు, అలాగే సినీ ప్రముఖులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సీన్ లలో అనుపమ రెచ్చిపోయి నటించింది.
అంతేకాకుండా ఈ సినిమాలో ఒక బెడ్ రూమ్ సీన్ కూడా ఉంది. ఇక ఇదే విషయం పై అనుపమ ని అభిమానులు ఒక రేంజ్ లో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇంతకుముందు నటించిన సినిమాలో ఇంత హాట్ గా నటించలేదు కదా.. మరి కొత్త హీరో సినిమాలు ఎందుకు ఇలా నటించింది అంటూ ఆమెను ఏకిపారేశారు. ఇంకొందరు అయితే నిర్మాత దిల్ రాజు భారీగా డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆమె అలా నటించింది అని కామెంట్స్ కూడా చేశారు. ఈ సినిమాతో అనుపమ హాట్ సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అని సినీ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇక దర్శక నిర్మాతలు కూడా అనుపమ కోసం అలాంటి ప్రత్యేక హాట్ సీన్లు రాస్తారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక ఇది ఇలా ఉంటే అనుపమ మాత్రం ఇకపై అన్ని సినిమాల్లో ముద్దు సీన్ లలో నటించను అని తేల్చి చెప్పిందట.