మార్పు కోసమే ఊ అన్నాను.. కెరియర్ లో సంతృప్తినిచ్చిన పాత్ర అదే: సమంత

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విడాకులకు ముందు ఈమె ఎప్పుడు ఒకే తరహా పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిత్యం ఇలాంటి పాత్రలలో కాకుండా కొత్త తరహా పాత్రలలో నటించాలని అలాంటి పాత్రల కోసం సమంత ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. అయితే ఇలా విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురు చూస్తున్న సమంతకు ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ అవకాశం వచ్చిందని ఈ కథ వినగానే తాను ఒక్క క్షణం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు.

ఈ సిరీస్ లో రాజీ పాత్ర కోసం తాను ఎంతో ఫీలయ్యి నటించానని ఈమె వెల్లడించారు. అలాగే సందర్భాన్ని బట్టి తాను ఐటమ్ సాంగ్ లో కూడా నటించాల్సి వచ్చిందని ఈ పాటను కూడా తాను ఎంతో చాలెంజ్ గా తీసుకొని నటించానని సమంత ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.సినీ కెరియర్లు ఎప్పుడు ఒకే తరహా పాత్రలు చేయకూడదని మార్పు కోసమే ఇలా ఐటమ్ సాంగ్ కు తాను ఓకే చెప్పానని వెల్లడించారు. ఇకపోతే ఇది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ అలాగే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఇక తన సినీ కెరియర్లో తనకు ఎంతో సంతృప్తినిచ్చిన పాత్రలలో రాజీ పాత్ర ఒకటని సమంత వెల్లడించారు. ఈ పాత్రలో చేయడం తనకు చాలా సంతృప్తిగా ఉందని ఈ పాత్ర తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈమె నటించిన శకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే యశోద, ఖుషి వంటి సినిమా షూటింగులతో ఈమె బిజీగా ఉన్నారు.