సితార రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు.. కిందపడి నవ్వుతోంది: మహేష్ బాబు

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ పరుశురామ్, హీరో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సోషల్ మీడియా సెలబ్రిటీస్ హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సన్నివేశం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ లో కీర్తి నన్ను తిట్టాలి. అయితే ఆమె నన్ను తిట్టడానికి కాస్త వెనకడుగు వేస్తోంది. ఈ సీన్ చేయడం కోసం ఏకంగా మూడు టేకులు తీసుకుంది.దీంతో డైరెక్టర్ పరశురామ్ గారు తన వద్దకు వచ్చి మేడం మీరు సార్ ను తిట్టాలి.గుర్తు పెట్టుకోండి మీరు ఆయనని తిట్టాలి అని పదే పదే చెప్పినప్పటికీ కీర్తి మాత్రం ఆ సీన్ చేయలేకపోయింది.

తను నన్ను తిట్టడానికి ఇబ్బంది పడుతోందని నాకు అర్థం అయింది. నన్ను తిట్టు ఏం పర్లేదు అని చెప్పినప్పటికీ వద్దు సార్ నేను మిమ్మల్ని తిడితే మీ ఫాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు అంటూ సమాధానం చెప్పింది. ఏమనరమ్మ నన్ను తిట్టు అని నేను చెప్పాను. అలా ఆ సీన్ కంప్లీట్ చేసాము. ఇక సినిమా విడుదలైన తర్వాత అందరం కలిసి సినిమా చూస్తున్న సమయంలో ఆ సీన్ రాగానే సితార ఒక్కసారిగా సోఫా నుంచి కింద పడి పోయి నవ్వుతోంది. సితారలో ఇలాంటి రియాక్షన్స్ నేనెప్పుడూ చూడలేదని మహేష్ బాబు ఈ సందర్భంగా సితార రియాక్షన్ గురించి తెలియజేశారు.