Hero Suman: అప్పట్లో తనకు, చిరంజీవికి మాత్రమే పోటీ ఉండేదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. పెద్ద నటుల్లో ముఖ్యంగా అప్పడు మొదటగా రామారావు గారు, నాగేశ్వర్‌రావు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్‌బాబు మాత్రమే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తరువాత బ్యాచ్‌లో వచ్చింది తాను, చిరంజీవి గారే అని, ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్, నాగార్జున వీళ్లు వచ్చారని ఆయన చెప్పారు. 1981లోనే తన కెరీర్ ప్రారంభమైందని వీళ్లు 87,88 సమయంలో ఇండస్ట్రీకి వచ్చారని సుమన్ అన్నారు.
ఒకప్పుడు తనకు, చిరంజీవి మాత్రమే మధ్య పోటీ ఉండేదన్న ఆయన, ఒకరికి రావాల్సిన అవకాశం మరొకరి వచ్చింది అనేటటువంటి వివాదాలు తామిద్దరూ ఏమీ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రొడ్యూసర్లు కూడా ముందే ఫిక్స్ అయిపోయేవారని, కొందరు చిరంజీవి గారితో చేయాలని అలా అని ఆయన చెప్పారు. రెండు గ్రూపులుగా ఉండేదని, ఒక గ్రూపు తనతో, మరొక గ్రూపు ఆయనతో తీసేవారని సుమన్ తెలిపారు. అంతే గానీ వారిద్దరి మద్య ఎలాంటి విభేదాలూ తలెత్తలేదని ఆయన అన్నారు.
ఒక సినిమా చిరంజీవి కాదన్నారని తాను చేసినట్టు వచ్చిన ప్రచారాన్ని సుమన్ ఖండించారు. తనకెప్పుడూ అసలు అలాంటి సంఘటన ఎదురు కాలేదని, ఒకరు తిరస్కరించిన సినిమాను తాను ఎప్పుడూ ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. అంతే కాకుండా చిరంజీవి గారికి కొందరు ఫిక్స్‌డ్ బ్యానర్స్ ఉండేవారని, అలా కొందరు డివైడ్ అయ్యి గ్రూప్‌గా మారి సినిమాలు తీశారని ఆయన వివరించారు.