Ram Charan: నాకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి.. కొన్ని రోజులు ఆగాల్సిందే ఉపాసన: రామ్ చరణ్

Ram Charan: మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది తను నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ను రామ్ చరణ్ కు ట్యాగ్ చేశారు.

ఈ సందర్భంగా ఉపాసన తెలియజేస్తూ మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందడం కోసం ఏదైనా చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ఉంది అంటూ పోస్ట్ చేశారు.ఉపాసన చేసిన ఈ పోస్టుకు రామ్ చరణ్ స్పందిస్తూ నాకు కూడా అలాంటి ఆలోచనే ఉంది కానీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాను. వెకేషన్ వెళ్లాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనని రామ్ చరణ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు నటించినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాని ఆస్వాదించలేకపోయారు. ఇక ఈ సినిమా భారీ నష్టాలను అందుకుందని సమాచారం.ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టి ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.