Samantha: మొదటి ప్రేమ ఎంత స్పెషల్… ఎప్పటికీ మర్చిపోలేను… సమంత సంచలన వ్యాఖ్యలు!

Samantha: ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సమంత. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సమంత ఓ వెలుగు వెలిగారు. ఇక ఈమె కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ సమంత కెరియర్ పరంగా బిజీ అయ్యారు. కానీ నాగచైతన్యతో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వీరిద్దరు కూడా వారి వ్యక్తిగత జీవితంలోను అలాగే వృత్తిపరమైన జీవితంలో బిజీ అయ్యారు. అయితే సమంత మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతూ సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలోనే సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడారు. తాను తన మొదటి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే ఈమె నాగచైతన్య గురించి చెప్పారని అనుకుంటే మనం పొరపాటు పడినట్లే నాగచైతన్య కంటే కూడా తనకు తన సినిమాలే ముఖ్యమని తన సినిమాలే తన ఫస్ట్ లవ్ అని తెలిపారు.

ఇప్పటికే సినిమాలకు చాలా బ్రేక్ ఇచ్చాను ఇకపై విరామం అనేది ఉండదని వరుస సినిమాలతో మీ ముందుకు రాబోతున్నాను అంటూ సమంత సినిమాల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతనే తిరిగి నటి శోభితను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.