టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన అనుపమ అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకొని వరుస సినిమాలలో బాగా అవకాశాలు అందుకుంటోంది. ఇక ఈమె ప్రస్తుతం నటించిన బటర్ ఫ్లై సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తనకు పవన్ గురించి ప్రశ్న ఎదురయింది.
ఇక పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు బురఖా వేసుకుని వెళ్లానని తెలిపింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అభిప్రాయం వెల్లడించేంత స్థాయి తనకు లేదు అని తెలిపింది. ఆయన పెద్ద హీరో అంటూ.. ఆయనను తాను ఎంతగానో అభిమానిస్తున్నాను అని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.