బ్యూటీ పార్లర్ లో ఏకంగా అసాంఘిక కార్యక్రమాలు.. ఎక్కడో తెలుసా?

అసాంఘిక కార్యక్రమాలు ప్రస్తుతం సమాజంలో ఎన్నో ప్రదేశాలలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అన్నట్టుగా కొన్ని కొన్ని సార్లు అలాంటి ప్రదేశాల గురించి బయటపడుతూ ఉంటాయి. అయితే కొన్ని చోట్ల అయితే బయట జిమ్, మసాజ్ సెంటర్, బ్యూటీ పార్లర్ అని పేర్లు పెట్టుకుని లోపల అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఇలాగే ఒక బ్యూటీ పార్లర్ లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకుని పోలీసులు దాడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్ ఏఎస్ రావు నగర్ లో గ్లోయిస్ బ్యూటీ కేర్ సెంటర్ పేరుతో గత కొద్ది రోజులుగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ఒకరోజు రాత్రి కస్టమర్ గా ఒక వ్యక్తిని పోలీసులు పంపగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బయట మసాజ్ సెంటర్ పేరు పెట్టుకుని లోపల మాత్రమే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ, మసాజ్ సెంటర్ ముసుగులో పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ అలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

నిర్వాహకుడు మహేష్ తో పాటు అందులో పని చేస్తున్నా అసోం, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐదుగురు యువతులను రెస్యు చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మసాజ్ సెంటర్ ముసుగులో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న పార్లర్ లపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నగర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఓ భవనంపై రైడ్ చేశారు. ఇక్కడ సరిగా రికార్డులు మెయింటెన్ చేయకపోవడం, కస్టమర్ల వివరాలను సేకరించకపోవడం,సీసీ కెమెరాలు లేకపోవడం, క్రాస్ మసాజ్ లాంటివి జరుగుతుండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా ముగ్గురు కస్టమర్లను ఒక రిసెప్షనిస్ట్ ను అరెస్టు చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.