Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమాలతో ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో పెడుతూ ఆశ్చర్యం కలిగించారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ రెండు సినిమాలు ఏకకాలంలో కంప్లీట్ చేస్తున్నారు. వాటిలో యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ మసాలా సినిమా “భీమ్లా నాయక్” ఒకటి.
ఇది మలయాళ సినిమా అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా మొదటి నుంచి కూడా చెప్పిన డేట్ జనవరి 12నే రిలీజ్ చెయ్యడానికే ఫిక్స్ అయ్యి ఉన్నారు. అవతల ఎలాంటి సినిమాలు ఉన్నా కూడా భీమ్లా నాయక్ మాత్రం వెనకడుగు వేసేది లేదు అని క్లియర్ గా నిర్మాత చెప్పేసాడు. అయితే ఈ సినిమా బృందం పై తీవ్ర స్థాయిలోనే ఒత్తిళ్లు వస్తున్నాయట.
థియేటర్స్ పరంగా ఏ సినిమాకి కూడా దెబ్బ పడకుండా ఉండాలి అంటే భీమ్లా నాయక్ మాత్రమే వెనక్కి తగ్గితే మంచిది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్. దీనితో మరికొందరు నిర్మాత నాగవంశీ ని డేట్ పై పునరాలోచన చేయమంటున్నట్టు సమాచారం. మరి ఫైనల్ గా ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది.