‘వకీల్ సాబ్’ టికెట్ రేట్లు.. ఫ్యాన్స్ జేబుకు చిల్లు

vakeel saab

vakeel saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న విడుదలకానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ క్రేజ్ నడుమ సినిమాను భారీ మొత్తానికి అమ్మేశారు నిర్మాతలు. ఆంధ్రా ఏరియాలో 40 కోట్లకు పైగా హక్కులు అమ్మారు. నైజాం ఏరియాలో నిర్మాత దిల్ రాజునే రైట్స్ ఉంచుకున్నారు. ట్రేడ్ వర్గాల మేరకు బిజినెస్ మొత్తం వెనక్కు రావాలంటే సినిమా పెద్ద హిట్టవ్వాల్సిందే. అది కూడ లాంగ్ రన్ చూపించాలి. అందుకే రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ మొదటి మూడు నాలుగు రోజుల్లోనే వీలైనంత వెనక్కు రాబట్టాలని చూస్తున్నారు.

మొదటిరోజు టికెట్ ధరలను భారీ రేట్లకు అమ్మాలని ప్లాన్ చేస్తున్నారట. మొదటిరోజు మార్నింగ్ షోకు ముందు రెండు మూడు బెనిఫిట్ షోలను వేయాలని వాటి టికెట్ రేట్లను వెయ్యికి పైగా అమ్మాలని అలాగే ఎర్లీ మార్నింగ్ షోకు ముందు ఒక ఎక్స్ట్రా షో వేసి ఆ షో టికెట్ ధరను 500 చేయాలని ఇక మిగిలిన షోల టికెట్లను వారం రోజుల వరకు 200 లకు విక్రయించాలని చూస్తున్నారట దిష్ట్రుబ్యూటర్లు. దీని వలన హిట్, ఫ్లాప్ సంబంధం లేకుండా ఓపెనింగ్స్ భారీగా రాబట్టవచ్చని, హిట్ అయితే వచ్చేవి లాభాలుగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ టికెట్ రేట్లను చూస్తుంటే పవన్ పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అభిమానుల జేబులకు చిల్లులు ఖాయం అనిపిస్తోంది.