మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో అధిక దిగుబడితోపాటు అత్యధిక పోషక విలువలున్న నూతన వంగడాలు అందుబాటులోకి వస్తున్నాయి. అలా ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కాయగూర ఎర్ర బెండకాయ దీనిని కాశీ బెండకాయ అని కూడా అంటారు.ఎర్ర బెండకాయలో సాధారణ బెండకాయ కంటే జిగురు తక్కువగా ఉండి 60 శాతం ఎక్కువ ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎర్ర బెండ కొంత ఖరీదైనప్పటికీ మన శరీర పోషణకు అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రధానంగా ఎర్ర బెండలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్ ,విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి .ముఖ్యంగా ఎర్ర బెండకాయలో క్యాలరీలు, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కావున ప్రతిరోజు వీటిని ఆహారంగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, అదుపు చేయవచ్చు.
ఎర్ర బెండలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయి. తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగి బీపి, గుండె జబ్బు వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.ఎర్ర బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం తొలగి శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ఎర్ర బెండకాయలు సమృద్ధిగా ఉంటే విటమిన్ ఏ కంటి సమస్యలను నివారిస్తుంది. విటమిన్ ఈ చర్మ కణాలను సరిచేసి సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. పిండి పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి చక్కెర వ్యాధిని అదుపు చేసి నియంత్రిస్తుంది.మన శరీర పెరుగుదలకు అవసరమైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ , ఫైబర్ వంటి పోషక విలువలు సమృద్ధిగా లభించి నిత్యం ఆరోగ్యవంతంగా జీవించడానికి సహాయపడతాయి.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఎర్ర బెండను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.