పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దమవుతోంది. పవన్ రీఎంట్రీ సినిమా కాబట్టి విపరీతమైన హైప్ నెలకొని ఉంది అభిమానుల్లో. మామూలుగా పవన్ సినిమా అంటే తుది ఫలితం ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో ఉంటాయి. టోటల్ ప్రీరిలీజ్ బిజినెస్లో 40 శాతం మొదటిరోజే రికవర్ చేయగల స్టామినా పవన్ కు ఉంది. అందుకే ఫస్ట్ డే వసూళ్ల మీదనే అందరి దృష్టి ఉంటుంది. ఈసారి కూడ అంతే. ఎవరికి వారు ఇంత అంత అంటూ లెక్కలు వేసుకుంటున్నారు.
ఒక్కసారి పవన్ పాత సినిమా రికార్డుల్ని పరిశీలించి చూస్తే మొదటిరోజు ఎంత కాదనుకున్నా ‘వకీల్ సాబ్’ ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. షేర్ 40 కోట్లు అంటే గ్రాస్ 60 కోట్ల పైమాటే. మూడేళ్ళ క్రితం వచ్చిన ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్స్ చూస్తే మొదటిరోజు షేర్ 39 కోట్ల వరకు ఉంది. ‘వకీల్ సాబ్’ డబుల్ హైప్ మీద దిగుతోంది కాబట్టి ఈజీగా 40 కోట్లకు పైగానే రాబట్టవచ్చు. సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ మొత్తం చూస్తే 90 కోట్లకు పైనే ఉంది. అంటే ‘వకీల్ సాబ్’ హిట్ అనిపించుకోవాలి అంటే 100 కోట్ల షేర్ రావాల్సిందే. సినిమా ఫస్ట్ డే హిట్ టాక్ తెచ్చుకుంటే 100 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు.