Chiranjeevi : చిరంజీవి మిస్సింగ్ పై రచ్చ స్టార్ట్ చేసిన ఓ వర్గం.!

Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో అపారమైన క్రేజ్ ఉన్న హీరోలు ఆయా ఫ్యామిలీ లు ఉన్నాయి. వాటిలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలి, అక్కినేని ఫ్యామిలీ అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ ఉన్నారు. అలాగే సొంతంగా స్టార్డమ్ తెచ్చుకున్న యంగ్ హీరోలు కూడా ఉన్నారు. అయితే సినిమా పరిశ్రమ లోనే ఉంటూ వారి మీదే బతుకుతూ ఓ వర్గం మాత్రం పలువురు స్టార్ హీరోలు వారి ఫ్యామిలీ హీరోలపై పర్సనల్ గా పోతూ ఏదొక కాంట్రవర్సీ రేపుతూనే ఉంటారు.

ఓ హీరో ఫంక్షన్లలో ఇంకో హీరో రాకపోతే ఎందుకు రాలేదు? వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా చెడిందా అంటూ విషపు బీజాలు నాటే ప్రయత్నం చేసి శునకానందం పొందుతారు. ఇప్పుడు సేమ్ మళ్లీ ఇదే డ్యామేజ్ మెగాస్టార్ చిరంజీవి పై మొదలు పెట్టారు. చిరు నిన్న జరిగినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” ప్రీ రిలీస్ కి ఎందుకు రాలేదు. వాళ్ళకి బాగా క్లోజ్ అయ్యింక్ చిరు మిస్ అవ్వడం ఏంటి అని ఓ వర్గం రచ్చ స్టార్ట్ చేశారు.

అసలు ఇలాంటివి వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారో వాళ్ళకే తెలియాలి. ఇది వరకు కూడా ఐకాన్ స్టార్ ఫంక్షన్ లు కూడా సోలో గానే జరిగిన సందర్భాలు ఉన్నాయి. గత ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు కూడా ఎలాంటి మెగా హీరోలు లేకుండానే జరిగాయి అంటే అప్పుడు నుంచే మెగాస్టార్ కి అల్లు అర్జున్ కి బంధం బ్రేక్ అయ్యిందా?? చిరు ని అమితంగా ప్రేమించే వారిలో అల్లు అర్జున్ కూడా ఒకడు. అలాంటి వారిపై ఇలాంటి కాంట్రవర్సీ లు చేసుకుంటే ఎమోస్తుందో.. బహుశా ఇతర కారణాలు ఉండొచ్చని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.