Nidhhi Agerwal : వైరల్ : తన “వీరమల్లు” పై హాట్ బ్యూటీ నిధి ఆశ్చర్యకర కామెంట్లు.!

Nidhhi Agerwal : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తన కెరీర్ లోనే టచ్ చెయ్యని జానర్ లో తెరకెక్కిస్తున్న భారీ సినిమా “హరిహర వీరమల్లు”. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ క్రిష్ దీనిని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఈ చిత్రంలో మన టాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈమెకి కూడా ఈ సినిమా చాలా కొత్తది. మరి ఇలా ఈ ఇద్దరూ మొదటి సారి స్క్రీన్ పంచుకుంటున్న ఈ సినిమా మరియు పవన్ పై నిధి అగర్వాల్ పలు ఆశ్చర్యకర కామెంట్స్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి హరిహర వీరమల్లు సినిమానే తనకి ఎంతో ఇష్టమైన సినిమా అని అలాగే పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ..

ఆయన ఒక టెర్రిఫిక్ పెర్ఫామర్ అని, అలాగే ఆయన ఒక వన్ మాన్ ఆర్మీ లాంటి వాడని ఇంకా అయన తన ఫేవరెట్ అని కూడా అసలు విషయం తెలిపింది. దీనితో ఇవి వైరల్ అవుతున్నాయి. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎ ఎం రత్నం 150 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.