Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష ఇప్పటికీ కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈమెతోపాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. మరీ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. త్రిష కు మాత్రం వయసు పెరుగుతున్న వయసుతో పాటు అందం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఈమెకు హీరోయిన్గా అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం కోలీవుడ్ హీరోలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా త్రిష నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. అయితే ఈమె గురించి ఇండస్ట్రీలో ఓ రూమర్ తరచూ వినపడుతూనే ఉంటుంది ఇండస్ట్రీలో ఒక హీరోతో ఈమె ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఇలా త్రిష హీరో విజయ్ దళపతితో ప్రేమలో ఉన్నారని ఈమె కారణంగానే విజయ్ దళపతి దంపతులు విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు అనే వార్త హల్చల్ చేస్తోంది. ఇలాంటి తరుణంలోనే త్రిష హీరో విజయ్ దళపతి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ… నాకు ఇండస్ట్రీలో హీరో విజయ్ దళపతి అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపారు. విజయ్ దళపతి నాకెంతో స్పెషల్ అంటూ ఈమె చెప్పుకు వచ్చారు. ఇలా త్రిష విజయ్ దళపతి గురించి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్న మాట నిజమేనని పలువురు భావిస్తున్నారు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగ లియో సినిమా కూడా ఇద్దరు కలిసి నటించారు. అలాగే విజయ్ నటించిన గోట్ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.