పెళ్లి కూతురిగా కొత్త గెటప్ లో మెరిసిన సమంత.. వైరల్ అవుతున్న ఫోటో!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఈ సినిమాలో తన అందంతో, తన నటనతో అందరినీ మాయ చేసింది. ఆ సినిమా మంచి హిట్ అవటంతో ఆమెకి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. సమంత నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలలో ఎక్కువగా నటించటం వల్ల ఆమె నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా సమంత లేడి ఓరియంటెడ్ సినిమాల్లో కూడ నటించి తన సత్తా చాటుకుంది.

అయితే అక్కినేని వారసుడు నాగచైతన్యని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇండస్ట్రీలోనే బెస్ట్ కపుల్ గా వీరు ఫేమస్ అయ్యారు. కానీ కొంతకాలం తర్వత ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆ బాధ నుండి బయటపడటానికి స్నేహితులతో కలిసి డివోషనల్ టూర్ లకి వెళ్ళింది. విడాకుల తర్వాత పుష్ప సినిమాలో స్పెషల్ సింగ్ లో ఉ అంటావా మామ ఉ ఊ అంటావా మామ అంటూ తన గ్లామర్ తో అందరినీ అలరించింది.

ఇటీవల సమంత , నయనతార కలిసి కాతు వాకల్ రెండు కాదల్ అనే తమిళ్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఒక సీన్ లో నయనతార ఎరుపురంగు చీరలో కనిపించగా..సమంత ఎరుపు రంగు షరారా లో కనిపించింది. ఇటీవల సమంత సోషియల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటోంది. ట్రెడిషనల్ దుస్తులతో పాటు, బికినీలు కూడ ధరించి ఫోటోలకు ఫోజులిస్తోంది. సోషల్ మీడియాలో తన ఫోటోల ద్వారా అందంతోనే ఆకట్టుకుంటున్న సమంత ఇటీవల ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో ఎరుపు రంగు షరారా ధరించి అచ్చం పెళ్ళికూతురు లాగా ముస్తాబు అయ్యింది. ఈ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సమంత ఫోటో సోషియల్ మీడియాలో వైరల్ గా మారింది.