cockroach: అసలే కరోనా రోజులు..! పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన సమయం..! వ్యక్తిగత పరిశుభ్రత మరీ ముఖ్యం. సెకండ్ వేవ్.. లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో వ్యవస్థలన్నీ తిరిగి గాడిలో పడుతున్న వేళలో వ్యక్తిగత జాగ్రత్త, పరిశుభ్రత పాటించాలి. మరీ ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ రంగంలో ఉన్నవాళ్లు. హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రజలు ఇష్టంగా తింటారు కాబట్టి. వాళ్లే నాణ్యత పాటించకపోతే.. కష్టం. ఇటువంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొంది హీరోయిన్ నివేధా పేతురాజ్. తాను ఆర్డ్ చేసిన ఫుడ్ లో బొద్దింక రావడం ఆమెను షాక్ కు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్న తెలిపింది.
హీరోయిన్ నివేదా పేతురాజ్ చెన్నైలోని ఓ పేరొందిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకునే క్రమంలో ఆన్‌లైన్‌లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది. తెరచి చూస్తే అందులో బొద్దింక ఉంది. ఆశ్చర్యపోయిన నివేధా రెస్టారెంట్, ఫుడ్ డెలీవరి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 23న బుధవారం సాయంత్రం జరిగిందీ సంఘటన. ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉన్న విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపింది. తన ఇన్ స్టా అకౌంట్ లో బొద్దింక ఉన్న ఫ్రైడ్ రైస్ పిక్ ను పోస్ట్ చేస్తూ.. రెస్టారెంట్‌ని ట్యాగ్ చేసంది.
‘ఈమధ్య హోటళ్లు సరిగ్గా పరిశుభ్రతను పాటించడం లేదు. నేను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. కస్టమర్స్ ఆరోగ్యంతో ఇటువంటి హోటళ్లు ఆడుకుంటున్నాయి. ఇలాంటి వారికి భారీ జరిమానా విధించాలి’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళంలో ‘ఓరు నాల్ కొథు’ అనే సినిమాతో.. తెలుగులో ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ‘చిత్రలహరి’, ‘అల.. వైకుంఠపురములో..’, ‘రెడ్’ వంటి హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘పాగల్’ చిత్రాల్లో నటిస్తోంది.