Bheemla Nayak: పవన్, రానా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఆశిస్తున్నా : వెంకటేష్

Bheemla Nayak: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ కి చంద్ర దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే తాజాగా భీమ్లా నాయక్ సినిమా పై హీరో విక్టరీ వెంకటేశ్ స్పందించారు. భీమ్లా నాయక్ రిలీజ్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను.. ఈ సినిమా నుంచి వదిలిన ప్రోమోలు, ట్రైలర్లు ఫెంటాస్టిక్ గా వచ్చాయి.. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు కూడా సూపర్ హిట్టు అందుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు విక్టరీ వెంకటేష్.