Sreekanth: ఆరోజు ఊహ నన్ను చూసి భయంతో వణికి పోయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్!

Sreekanth: శ్రీకాంత్ తన సినీ కెరీర్ లో సుమారు 125 చిత్రాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్న శ్రీకాంత్ తన కెరియర్ లో విలన్ గా కూడా నటించిన చిత్రాలు ఉన్నాయి.ఇకపోతే విలన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ కు మంచి గుర్తింపు తీసుకురాక పోయినప్పటికి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వరదరాజులు అనే విలన్ పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా శ్రీకాంత్ అఖండ సినిమా విజయోత్సవం కావడంతో శ్రీకాంత్ పలు ఇంటర్వ్యూలకు హాజరు అవుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ తన భార్య ఊహతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో అందరిని మెప్పించిన శ్రీకాంత్ భయంకరమైన విలన్ పాత్రలో నటించే సరికి చాలా మంది అభిమానులు తన పాత్రను జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ కు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ వ్యక్తిగతంగా తన పాత్ర తనకెంతో నచ్చిందని వెల్లడించారు.

ఇక ఈ పాత్ర చూసి చాలామంది భయపడ్డారనీ శ్రీకాంత్ తెలుపగా ఒకసారి షూటింగ్ పూర్తి కాగానే గెటప్ చేంజ్ చేసుకోకుండా అలాగే ఇంటికి వెళ్లాలని తెలిపారు. షూటింగ్ నుంచి అలా ఇంటికి వెళ్లేసరికి ఊహ మరి కొంత మందితో మాట్లాడుతూ కూర్చుంది. ఒక్కసారిగా నన్ను చూసి వణికిపోయిందనీ,మిగతావారు కూడా హడలిపోయారని ఈ సందర్భంగా శ్రీకాంత్ తన వరదరాజుల పాత్ర గురించి వెల్లడించారు.