Hero Siddharth: హీరో సిద్ధార్థ్ సినిమాలలో కన్నా వివాదాలతో ఎక్కువగా మంచి ఆదరణ దక్కించుకున్నారని చెప్పాలి. ఈయన సినిమాలలో కంటే సోషల్ మీడియా ద్వారా పలు సామాజిక అంశాలు రాజకీయ అంశాల పై స్పందిస్తూ ఎన్నో వివాదాలకు కారణం అవుతున్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా జాతీయ మహిళా కమిషన్, పలువురు మంత్రులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో ఖండించారు.
ఇలా రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.చివరికి సైనానెహ్వాల్ తండ్రి ఈ విషయంపై స్పందిస్తూ సిద్ధార్థ్ తన కూతురికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలిపారు. ఈ క్రమంలోనే హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ సైనా నెహ్వాల్ కి క్షమాపన తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక లేఖ ద్వారా సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ కి క్షమాపణలు చెప్పారు.
ఈ సందర్భంగా హీరో లేఖ రాస్తూ… సైనా నెహ్వాల్ పై తాను చేసిన ట్వీట్స్ కేవలం జోక్ గా మాత్రమే చేశానని,తనకు మహిళలను కించపరుస్తూ కామెంట్ చేయాలని ఉద్దేశం ఏమాత్రం లేదని నేను చేసిన ట్వీట్స్ అందరు పొరపాటుగా అర్థం చేసుకున్నారని లేఖలో సిద్ధార్థ్ తనకు క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చారు. పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి పై దాడి సంఘటనకు సంబంధించి సైనానెహ్వాల్ ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మొత్తానికి ఎన్నో వివాదాల తర్వాత సిద్ధార్థ్ బహిరంగంగా సైనా నెహ్వాల్ కి క్షమాపణలు చెప్పారు.