చిరంజీవి కొడుకైనా చరణ్ తొలి సినిమా రెమ్యునరేషన్ అంత తక్కువా?

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయస్సులో కూడా మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ ద్వారా విమర్శలు చేసేవాళ్లకు చరణ్ తనదైన శైలిలో జవాబిస్తున్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.

ఈ సినిమాలో చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయింది. చరణ్ కు జోడీగా నేహా శర్మ ఈ సినిమాలో నటించగా చరణ్ తో నటించినా నేహాశర్మకు పెద్దగా సినిమా ఆఫర్లు అయితే రాలేదు. చరణ్ కు ఈ సినిమాకు సంబంధించి కేవలం 50 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కిందని తెలుస్తోంది. పరిమిత బడ్జెట్ లోనే సినిమా తెరకెక్కడంతో చరణ్ కు తక్కువగానే రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.

మరోవైపు చరణ్ రెమ్యునరేషన్ల విషయంలో కూడా పట్టింపులకు పోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తన సినిమాలు ఫ్లాపైన సమయంలో చరణ్ రెమ్యునరేషన్ ను వెనక్కు ఇచ్చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. చరణ్ సమయం వచ్చిన ప్రతి సందర్భంలో ఉదారతను చాటుకుంటూ తనను అభిమానించే అభిమానుల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

చరణ్ తర్వాత సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ సాధించాల్సిన బాధ్యత చరణ్ పై ఉంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న 50వ సినిమా కావడంతో ఈ సినిమా బడ్జెట్ విషయంలో దిల్ రాజు సైతం రాజీ పడటం లేదని తెలుస్తోంది.