Samantha: ఇంట్లో నాగార్జున అమల మాటే వింటారా… అసలు విషయం బయట పెట్టిన సమంత?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అక్కినేని కోడలుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత కొన్ని మనస్పర్థల కారణంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి సారించి వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ఇలా విడాకుల తర్వాత సమంత నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే సమంత పరోక్షంగా కొన్నిసార్లు అక్కినేని కుటుంబం పై విమర్శలు చేస్తున్నారని పలువురు సమంత గురించి ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా సమంత అక్కినేని కుటుంబం పై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసినట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే విడాకుల ప్రకటన తర్వాత నాగార్జున ఈ విషయంపై స్పందిస్తూ సమంత అంటే తనకు ఎంతో అభిమానం ఇష్టమని తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నాగార్జున సమంతతో మాట్లాడటం కోసం ఈ మధ్య కాలంలో ఫోన్ చేస్తే సమంత తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టారని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని తన పక్కనున్న హీరోతో మాట్లాడుతూ నాగార్జున ఇంట్లో అమల ఏది చెబితే అదే వింటారు ఆయనతో మాట్లాడి కూడా వేస్ట్ అని సమంత చెప్పినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే అక్కినేని కుటుంబం గురించి సమంత ఇలా మాట్లాడటంలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సమంత యశోద సినిమా షూటింగ్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా తాజాగా పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ ద్వారా సమంత మరింత క్రేజ్ దక్కించుకున్న విషయం మనకు తెలిసిందే.