కృష్ణను దారుణంగా అవమానించిన వారెవరో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో కొత్త తరహా పాత్రలను పరిచయం చేసిన నటుడు కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి పాత్రలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి హిట్టు లేక సతమతమయ్యారు. ఈయన నటించిన 12 సినిమాలు వరుసగా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో కృష్ణ పరిస్థితి ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయింది.

ఇలా ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా ఉండడమే కాకుండా ఈయన నటించిన సినిమాలు కూడా హిట్ కాకపోవడంతో చాలామంది ఇండస్ట్రీలో ఇతనిని ఇక నువ్వు హీరోగా పనికిరావు ఇక నీకు సినిమా అవకాశాలు రావు అంటూ పెద్ద ఎత్తున హేళన చేశారని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణ వెల్లడించారు. ఇకపోతే కృష్ణ ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్న తర్వాత ఎలాగైనా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగాలని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని భావించారు.

ఈ క్రమంలోనే తన సొంత తమ్ముడు చేత పద్మాలయ స్టూడియో అనే ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించిన కృష్ణ ఏకంగా బడిపంతులు అనే సినిమా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవడంతో కృష్ణ తిరిగి ఇండస్ట్రీలో వెను తిరిగి చూసుకోలేదు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కృష్ణ కొనసాగుతూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఇకపోతే ప్రస్తుతం ఈయన వయసు పై పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకుంటున్నారు.