ఆ సినిమాతో చిరంజీవి, వెంకటేష్ లకు భారీ షాకిచ్చిన బాలయ్య.. ఏమైందంటే?

ఈ తరంలో స్టార్ హీరోలు ఎవరనే ప్రశ్నకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఈ జాబితాలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పేర్లు వినిపించేవి. ఈ హీరోలు నటించిన సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సందడి నెలకొనేదనే సంగతి తెలిసిందే.

2001 సంవత్సరం సంక్రాంతి సమయంలో ఈ ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాలలో బాలకృష్ణ నటించిన సినిమా పైచేయి సాధించడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు, బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు, విక్టరీ వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు సినిమాలు ఒకే సమయంలో థియేటర్లలో విడుదలయ్యాయి. అందరూ మృగరాజు, దేవీపుత్రుడు సినిమాలు హిట్టవుతాయని భావించారు.

ఈ సినిమాలలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండటంతో అలా జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే కథ, కథనంలోని లోపాల వల్ల మృగరాజు, నాసిరకం గ్రాఫిక్స్ సన్నివేశాలతో తెరకెక్కిన దేవీపుత్రుడు సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించారు. నరసింహ నాయుడు సినిమా మాత్రం తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించడం గమనార్హం.

బాలకృష్ణ సినీ కెరీర్ లోని ఇండస్ట్రీ హిట్లలో నరసింహ నాయుడు సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మృగరాజు సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. చిరంజీవి ఎంతో కష్టపడినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. నరసింహనాయుడు సినిమా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.