నారా లోకేష్ సెల్ఫ్ గోల్: సంతోష్ పేరుతో మరో కొడుకున్నాడా.?

ఎవరో ఏదో అన్నారంటే.. అది వేరే విషయం. ఎవరో ఏదో అన్నారని, ఆ విషయాన్ని తానే చెప్పుకుంటే అంతకన్నా భావదారిద్ర్యం ఇంకేముంటుంది.? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కి వేరే శతృవు అక్కర్లేదు. సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి సుద్దులు చెప్పే క్రమంలో, ఆయన మీద విమర్శలు చేసే క్రమంలో నారా లోకేష్ అదుపు తప్పారు. విషయాన్ని తన మీదకు తిప్పుకున్నారు. తనను తానే టార్గెట్ చేసుకున్నారు. నారా లోకేష్‌కి దేవాన్ష్ పేరుతో ఓ కుమారుడున్న విషయం అందరికీ తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి, నారా లోకేష్ సతీమణి. నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల పుత్ర రత్నం దేవాన్ష్. కానీ, నారా లోకేష్‌కి ఇంకో కొడుకున్నాడట.. అలాగని కొందరు నారా లోకేష్ మీద విమర్శలు చేస్తారట, దుష్ప్రచారం చేస్తారట. కాదు కాదు, చేస్తున్నారట. ఆ రెండో కుమారుడి పేరు కూడా సంతోష్ అట.

స్వయంగా నారా లోకేష్ చెప్పుకున్న విషయాలివి. నిజానికి, ఎవరైనా ఇలా మాట్లాడతారా.? అసలు నారా లోకేష్ మీద ఇంతవరకు ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేశారా.? ‘పప్పుగాడివి.. నువ్వెందుకూ పనికిరావు..’ అని కదా, నారా లోకేష్ మీద ఎవరైనా విమర్శలు చేసేది.?

‘కొందరు విదేశీ భామలతో కలిసి నారా లోకేష్ తైతక్కలాడాడు..’ అని ఆయన మీద విమర్శలు చేస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ, నారా లోకేష్ రెండో కొడుకు పేరు సంతోష్.. అని ఇప్పటిదాకా ఎక్కడా గాలి వార్త కూడా వచ్చిన దాఖలాల్లేవు. సోషల్ మీడియాలోనూ అలాంటి ప్రచారం జరిగిన సందర్భం ఇప్పటిదాకా లేదు.

ఎక్కడ ఏ చిన్న గాలి వార్త వచ్చినా, అది పెను దుమారం రేపే రోజులివి.

కానీ, అదేమీ లేకుండానే, ఏదో జరిగిపోయిందనే భ్రమలో నారా లోకేష్ తన పరువు తానే తీసేసుకున్నారన్నమాట.