Home News హరీష్ శంకర్ 'బద్రి' లెవల్లో బిల్డప్ ఇస్తున్నాడు

హరీష్ శంకర్ ‘బద్రి’ లెవల్లో బిల్డప్ ఇస్తున్నాడు

హిట్, ఫ్లాప్ ఫలితాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సూపర్ క్రేజ్ సంపాదించడం వెనుక ఉన్న సీక్రెట్ ఆయన ఎనర్జీ.  పవన్ సినిమా అంటే ఒక ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉంటుంది.  ‘బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్’ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి రీజన్ ఆయన ఎనర్జీనే. ఇప్పుడు ఇదే స్థాయి ఎనర్జీ తన సినిమాలో ఉండబోతుంది అంటున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్.  త్వరలో ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాను మొదలుపెట్టనున్నారు.  జూలై లేదా ఆగష్టు నెలలో వీరి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. గతంలో హరీష్ శంకర్ పవన్ హీరోగా ‘గబ్బర్ సింగ్’ తీసి ఇమెడ్స్ట్రీ హిట్ అందుకున్నారు.  
 
అందుకే వీరి కాంబినేషన్ మీద విపరీతమైన హైప్ ఉంది. హరీష్ శంకర్ కూడ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందని అంటున్నారు.  ‘బద్రి’ చిత్రంలోని వీడియో షేర్ చేసి ఇలాంటి ఎనర్జీని మళ్లీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.  వీరు చేయబోయే సినిమాలో పవన్ కాలేజ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో చిరంజీవి చేసిన ‘ఠాగూర్, మాస్టర్’ చిత్రాల ఫ్లేవర్ ఉంటుందని టాక్.  పైగా పవన్ డ్యూయల్ రోల్ చేస్తారని కూడ అంటున్నారు.  మొత్తానికి హరీష్ శంకర్ తమ సినిమాకు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే అభిమానుల్లో ఆసక్తి, హైప్ పెరిగిపోతున్నాయి.  చెబుతున్నట్టే హరీష్ శంకర్ ‘బద్రి’ లాంటి ఎనర్జిటిక్ సినిమా తీయగలిగితే మాత్రం సూపర్ హిట్ గ్యారెంటీ. 

Related Posts

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News