ఎదురుచూపుల్లో నలిగిపోతున్న హరీష్ శంకర్

Harish Shankar eagerly waiting to start movie with Pawan Kalyan
Harish Shankar eagerly waiting to start movie with Pawan Kalyan
హరీష్ శంకర్ చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు.  పవన్ రీఎంట్రీకి సిద్ధమైనప్పుడే హరీష్ శంకర్ కు సినిమా చేస్తానని మారిచ్చారు. ఆమేరకు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమాకి సైన్ చేశారు. ఏడాదిన్నర కాలంగా హరీష్ శంకర్ ఈ సినిమా మీద పనిచేస్తున్నారు. ఆలస్యం అవుతుందని తెలిసిన వేరే సినిమాకు కమిట్ అవ్వకుండా పవన్ ప్రాజెక్ట్ మీదే కూర్చున్నారు. అయితే ఆయన అనుకున్నదానికంటే సినిమా ఎక్కువ ఆలస్యం అయింది. సెకండ్ వేవ్ లాక్ డౌన్ దెబ్బకు సుమారు రెండు నెలలు సినిమా వెనక్కి వెళ్ళింది.  
 
పవన్ కళ్యాణ్ ఉన్న ఊపుకి ఈపాటికి చిత్రం మొదలై ఒక షెడ్యూల్ కూడ ముగిసేది.  కానీ కుదరలేదు.  దీంతో అభిమానులు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్, టైటిల్ ఇదివరకే రావాల్సింది కానీ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఆగిపోయాయి.  వాటి కోసమే ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రమే కాదు హరీష్ శంకర్ కూడ ఎదురుచూపుల్లో నలిగిపోతున్నాడు.  పవన్ అంటే ఆయనకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.  పవన్ తో సినిమా అంటే ప్రపంచాన్ని మర్చిపోతాడు.  కానీ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నా మొదలుపెట్టడానికి, హడావుడి చేయడానికి కుదరట్లేదు.  దీంతో ఆయనలో కూడ ఆతురట ఎక్కువైపోయింది.  మీతో వర్క్ చేయడానికి చాలా ఎదురుచూస్తున్నాను అంటూ ‘గబ్బర్ సింగ్’ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆ ఫోటోలు పెడుతున్నారు.