గ్రేటర్ ఎన్నికలల్లో జోరు చూపించి ప్రతీకారం తీర్చుకున్న హరీష్ రావు

harish rao greater elections

 గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు భారీ మెజారిటీ రాకపోయిన కానీ పరువు పోకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. గతంలో 99 స్థానాల్లో విజయం సాధించిన గులాబీ ప్రస్తుతం 55 స్థానాలతో సరిపెట్టుకుంది. నిజానికి గ్రేటర్ ఎన్నికలను తెరాస చాలా సీరియస్ గా తీసుకోని ప్రచారం ముమ్మరం చేసింది. తమ క్యాబినెట్ మంత్రులందరినీ గ్రేటర్ లో మోహరించి ఒక్కొక్క మంత్రికి ఒక్కో సర్కిల్ కేటాయించి ఎన్నికలకు వెళ్ళాడు కేసీఆర్.

harish rao greater elections

 ఇందులో భాగంగా మంత్రి హరీష్ రావు పఠాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, భారతి నగర్, పఠాన్ చెరు డివిజన్స్ లో అభ్యర్దులను గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. ఇందులో భాగంగా ప్రతి వంద మంది ఓటర్లను వీడివిడిగా లెక్కించి వాళ్ళందరిని పోలింగ్ బూత్ వద్దకు తీసుకోని వెళ్లి ఓట్లు వేయించే బాధ్యతను ఒక్కో నాయకుడికి అప్పగించాడు. అదే విధంగా ఆ మూడు డివిజన్స్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించాడు. అదే సమయంలో ప్రతి ఇంటికి ఫోన్ కాల్స్ ద్వారా సందేశాలు పంపించటం, ఫోన్స్ చేసి మాట్లాడటం లాంటి కార్యక్రమాలు చేశాడు.

 దీనితో పాటుగా హరీష్ రావుకు బాగా ఆనుభవం ఉన్న పోల్ మేనేజ్మెంట్ ను ఆయా డివిజన్స్ పరిధిలో పక్కగా అమలు చేసి తాను బాధ్యత తీసుకున్న మూడు డివిజన్స్ లోని తెరాస పార్టీ అభ్యర్థులను గెలిపించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులను ఓడించి మరి గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు. దీనితో ఒక రకంగా దుబ్బాకలో జరిగిన ఓటమికి ఇక్కడ హరీష్ రావు ప్రతీకారం తీర్చుకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.

 దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస తరుపున సర్వం తానై వ్యవహరించిన హరీష్ రావు అక్కడ విజయాన్ని సాధించలేకపోయాడు. దాదాపు ఎన్నికల ప్రచారానికి నెల రోజుల ముందు నుండే అక్కడ ఎన్నికల వ్యూహాలు అమలు చేసిన కానీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ చేతిలో ఓటమి తప్పలేదు. దీనితో హరీష్ రావు నాయకత్వానికి అదే మచ్చ లాగా మిగిలిపోయింది. గ్రేటర్ పరిధిలో బీజేపీ అభ్యర్థుల మీద విజయం సాధించి ఆ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం చేశాడు. 

 మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసయ్య అకాల మరణముతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీనితో ఇప్పటికే అన్ని పార్టీల చూపు సాగర్ వైపు మళ్లింది. మరి ఈ ఉప ఎన్నికల్లో తెరాస గెలిచి బీజేపీ మీద అసలైన ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.