Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అట్లుంటది మరి పవన్ ఫ్యాన్స్ తోటి!

Pawan Kalyan: అందరి హీరోలకు అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ కి మాత్రం డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో అలాగే సినిమా థియేటర్ల ముందు పవన్ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి మంచి ప్యాన్స్ ని కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ చూపు అంతా హరిహర వీరమల్లు సినిమా పైనే ఉంది.

ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అనేక కారణాలవల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఈ నెల 12న విడుదల అవుతుంది అనుకుంటే వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్‌ను చాలా నిరుత్సాహ పరచిన మూవీ మేకర్స్ మరోసారి సినిమా విడుదల తేదీ ప్రకటించి వాయిదా వేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నంపై మండిపడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో సరైన స్పష్టత రాకపోవడంతో తీవ్రంగా మండిపడుతున్నారు ఫాన్స్.

అయితే అయ్యే పని కాదని, మూవీ మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించేది ఏంటి మేమే విడుదల తేదీని ప్రకటిస్తున్నాము అంటూ కొంతమంది సినిమా విడుదల తేదీన వాయిదా వేస్తూ కొన్ని రకాల పోస్టర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అలా షేర్ చేసిన పోస్టర్స్ లో కొంతమంది జూన్ చివరి వారంలో సినిమా రానుంది అంటే, మరికొందరు జులై మొదటి వారంలో రాబోతోంది అంటూ డేట్ ను ప్రకటించేశారు. దీంతో చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంతో చేస్తున్నారు అన్న విషయం అందరికీ అర్థం అయిపోయింది. మరి ఇప్పటికైనా హరిహర వీరమల్లు మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి మరి.