Tollywood: ప్రస్తుతం తెలుగు సినిమా ఎక్కువగా వినిపిస్తున్న పేరు హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమా అనేక ఒడిదుడుకులను దాటుకొని జూన్ 12న విడుదల కాబోతోంది అంటూ మూవీ తెగ హడావిడి చేశారు. కానీ ఈ మూవీ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. కాగా పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంత ఎదురుచూస్తుంటే అంత వెనక్కి వెళ్తుంది. ఎప్పుడో కరోనాకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలుపెట్టిన ఈ సినిమా ప్రొడక్షన్ లోనే నాలుగేళ్లకు పైగా ఉంది.
కరోనా రావడం, ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, మధ్యలో కొన్నాళ్ల పాటూ పవన్ ఈ సినిమాను కాదని వేరే సినిమాలు చేయడంతో ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని అందరూ అనుమానపడ్డారు. అందరి అనుమానాలకీ చెక్ పెడుతూ రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ గా జూన్ 12న సినిమా రిలీజ్ అంటూ హడావిడి చేశారు. తీరా చూస్తే ఇప్పుడు కూడా వీరమల్లు ఆ డేట్ కు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తవని నేపథ్యంలో హరి హర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడటం ఖాయం అనిపిస్తోంది. దీంతో నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాకు మరో రిలీజ్ డేట్ ను వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే సినిమాను మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా వెంటనే రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే జూన్ 20వ తేదీన ధనుష్, నాగార్జున కలిసి నటించిన కుబేర సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ విషయం పట్ల అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పోటీని తట్టుకుని రిలీజ్ చేద్దామంటే వీరమల్లుకు పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే కలెక్షన్లు షేర్ చేసుకుంటే కష్టమే అవుతుందట. కాబట్టి కుబేరతో పాటు హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేసే అవకాశం లేదు. దీంతో పాటూ మరో రీజన్ కూడా ఉంది. దానికి కారణం హరి హర వీరమల్లు సినిమాను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ వీడియోనే కుబేర ఓటీటీ హక్కులను కూడా కొనుగోలు చేసింది. కాబట్టి వీరమల్లు జూన్ 20న ఎట్టి పరిస్థితుల్లో రాదు. మరి హరిహర వీరమల్లు సినిమాను ఈ నెలలోనే విడుదల చేస్తారా లేదంటే వచ్చే నెలలో విడుదల చేస్తారా అన్నది చూడాలి మరి.