ఈ నెల 28న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడిపూడి శ్రీహరి – ‘జెమిని’ శ్రీనివాసుల సంతాప సభ

మన నుంచి భౌతికంగా దూరమైన సీనియర్ పాత్రికేయులు, ఆత్మీయులు, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు గుడిపూడి శ్రీహరి, మరియు ‘జెమిని’ శ్రీనివాసుల సంతాప సభను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్ష-కార్యదర్శులు కొండేటి సురేష్ – మసాదే లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 28న గురువారం సాయత్రం 6 గంటలకు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ (FNCC)లోని గ్రౌండ్ ఫ్లోర్ బ్యాంకెట్ హాల్లో ఈ సంతాప సభ జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో అత్యంత కీలక పాత్ర పోషించి.. ఫిలిమ్ జర్నలిస్టులకు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ప్రముఖ సినీ పాత్రికేయులలో ఒకరైన గుడిపూడి శ్రీహరి, మరియు ‘జెమిని’ శ్రీనివాసులకు ఘన నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో విధిగా ఫిలిం జర్నలిస్టులంతా పాల్గొనాలని వారు కోరారు. అలాగే… అతి చిన్న వయ్సస్సులోనే ఎంతో భవిష్యత్హు ఉన్న మన మిత్రుడు ‘జెమిని’ శ్రీనివాస్ అకాల మరణం పొందిన విషయం మనం జీర్ణించుకోలేం.

ఈ సందర్బంగా ‘జెమిని’ శ్రీనివాస్ కు నివాళి అర్పిద్ధామని వారు పేర్కొన్నారు. ఈ సందర్బంగా జరిగే గుడిపూడి శ్రీహరి – ‘జెమిని’ శ్రీనివాసుల సంతాప సభకు పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారని, ఈ కార్యక్రమం పూర్తి కావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ‘భోజన వసతి’ (Dinner) ఏర్పాటు చేయడమైనదని వారు తెలిపారు. ఈ సందర్బంగా జరిగే కార్యక్రమానికి గుడిపూడి శ్రీహరి – ‘జెమిని’ శ్రీనివాసుల సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా ఫిలిం జర్నలిస్ట్ మిత్రులందరూ సకాలంలో హాజరై మన దివంగత మిత్రులైన గుడిపూడి శ్రీహరి – ‘జెమిని’ శ్రీనివాసుల ఆత్మకు శాంతిని చేకూర్చేలా ప్రార్ధించాలని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సవినయంగా కోరుకుంటుందని వారు పేర్కొన్నారు.