గాసిప్స్ : ఆ బిగ్ స్టార్ సినిమాలో క్యామియోకి మహేష్? డీటెయిల్స్ ఇవే.!

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చూస్తే దాదాపు అన్నీ భారీ మల్టీ స్టారర్ సినిమాలే ఉన్నాయి. జనవరిలో వచ్చిన “బంగార్రాజు”, ఫిబ్రవరి లో “భీమ్లా నాయక్”, మార్చ్ లో ట్రిపుల్ ఆర్(RRR), ఏప్రిల్ లో “ఆచార్య” ఇలా ఒక్కో నెలలో ఒక్కో బిగ్ మల్టీ స్టారర్ పడింది.

అయితే దాదాపు ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుండగా రీసెంట్ గా తమిళ్ నుంచి “విక్రమ్” అనే ఒక సినిమా వచ్చి భారీ హిట్ అయ్యింది. దీనిలో అయితే నటుడు సూర్య క్యామియో చూసి అందరు షాకయ్యారు. దీనితో క్యామియోస్ పై కూడా అందరిలో ఆసక్తి నెలకొనగా ఇప్పుడు మరో సెన్సేషనల్ క్యామియో పడనున్నట్టుగా తెలుస్తుంది.

ఈ డీటెయిల్స్ చూస్తే మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడైన తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి గాను ఇంట్రెస్టింగ్ క్యామియోలో కనిపించే అవకాశం ఉందని సాలిడ్ గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అయితే ఇది తమిళ మీడియా నుంచి వినిపిస్తున్న స్ట్రాంగ్ సమాచారం. ఒకవేళ గాని ఇది నిజం అయితే ఒక పక్క విజయ్ కి తెలుగులో మహేష్ కి తమిళ్ లో భారీ క్రేజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పాలి. ఎలాగో వంశీ కి మహేష్ కి మాంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఈ సెన్సేషనల్ కాంబోని ఒకే స్క్రీన్ పైకి తెచ్చే అవకాశం ఉంది. మరి ఈ గాసిప్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాల్సిందే.