గాసిప్స్ : “హరిహర వీరమల్లు” లో పవన్ అప్పుడు అడుగు పెడతాడట..?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ చిత్రాల్లో పవన్ హీరోగా చేస్తున్న ఫస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”. దర్శకుడు క్రిష్ తో పవన్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం పైగా అందులో భారీ స్థాయి పాన్ ఇండియా సినిమా ఎలా లేదన్నా 150 కోట్లకి పైగా బడ్జెట్ సినిమా ఇది కావడంతో పవన్ ఫాన్స్ లో అనేక అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. 

అయితే దాదాపు 55 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మళ్ళీ పవన్ భారీ బ్రేకులు మూలాన వాయిదా పడుతుంది. కానీ ఇప్పుడు అయితే పవన్ ఎలా లేదన్నా తన పొలిటికల్ యాత్ర కన్నా ముందే వీలైనంత కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నాడు. అందులో భాగంగా ఇపుడు అసలు వీరమల్లు సెట్స్ లో మళ్ళీ ఎప్పుడు అడుగు పెడతాడో అనేది గాసిప్స్ తెలుస్తున్నాయి. 

లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే పవన్ జూలై చివరి వారంలో కానీ ఆగస్ట్ లో గాని జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి అప్పుడైనా పవన్ వస్తాడో లేదో ఎవరికీ క్లారిటీ లేదు. ఇంకా ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం నిర్మాతగా చేస్తున్నారు.