గాసిప్స్ : “వీరసింహా రెడ్డి” లో బాలయ్య ఇన్ని గెటప్స్ లో కనిపిస్తారా?

ఇప్పుడు టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ లో మంచి హైప్ తో ఉన్న చిత్రాల్లో సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న భారీ ఏక్షన్ చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి. దర్శకుడు గోపించంద్ మలినేనితో అయితే బాలకృష్ణ తన కెరీర్ లో 107వ సినిమాగా చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం అయితే నిన్ననే ఈ సినిమా టైటిల్ ని గ్రాండ్ మ్యానెర్ లో రిలీజ్ చెయ్యగా అక్కడ నుంచి సినిమాపై మరింత స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా లో అయితే బాలయ్య మళ్ళీ రెండు పాత్రలు చేస్తున్నట్టుగా తెలిసిందే. కానీ ఇపుడు సినీ వర్గాల్లో లేటెస్ట్ గాసిప్స్ ఏమిటంటే..

ఈ చిత్రంలో బాలయ్య మూడు వేరియేషన్స్ లో కనిపించే ఛాన్స్ ఉన్నట్టుగా అంటున్నారు. రెండు లేదా మూడు వేరియేషన్స్ కానీ  గెటప్స్ లో అయితే తాను కనిపిస్తాడని అంటున్నారు. దీనితో అయితే ఈ సినిమాలో ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ పక్కా అని తెలుస్తుంది.

అలాగే ఏక్షన్ బ్లాక్ లు కూడా మరో లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో అయితే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ మరియు దునియా విజయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు.