గోపిచంద్ సినిమా నాలుగేళ్లు ఆలస్యంగా రిలీజవుతోంది

Gopichand's Aradagula Bullet ready to release
Gopichand's Aradagula Bullet ready to release
 
సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో హీరో గోపిచంద్ చేసిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.  చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత తలెత్తిన కొన్ని కారణాల వలన విడుదలకాకుండా ఆగిపోయింది. ఎప్పుడో 2017లో రావాల్సిన చిత్రం ఇది. ఆర్థికపరమైన కష్టాలే సినిమాను ల్యాబ్లో మిగిలిపోయేలా చేశాయి. మంచి బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాపులర్ టెక్నీషియన్లు ఈ సినిమాకు వర్క్ చేయడం జరిగింది.  దాదాపు నాలుగేళ్ళు మూలనపడిన ఈ సినిమా ఎట్టకేలకు కష్టాల్లోంచి బయటపడింది.  
 
నిర్మాత తాండ్ర రమేష్ ఎన్నో వ్యయప్రయాసలు పడి ఇబ్బందులను తొలగించారు.  ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమ అయిన సినిమాను ఇక ఏమాత్రం జాప్యం చేయకూడదని డిసైడ్ అయ్యారట ఆయన.  అందుకే థియేటర్లు ఓపెన్ కాగానే విడుదల చేయాలని చూస్తున్నారు. ఎలాగూ భారీ సంఖ్యలో స్క్రీన్లు అవసరం లేదు కాబట్టి దొరికినన్ని వాటిలో 50 శాతం ఆక్యుపెన్సీ అయినా పర్వాలేదని అనుకుంటున్నారట.  మొత్తానికి గోపిచంద్ కొత్త చిత్రం ‘సీటిమార్’ కంటే ముందు ఈ చిత్రమే రిలీజయ్యేలా ఉంది.  ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వం కావడం, సంగీతం అందించిన మణిశర్మ ఇప్పుడు మంచి ఫామ్లో ఉండటం, నయనతార క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి.