ఆ రెండు ఓటిటి యాప్స్ తో గోపీచంద్ సినిమా సాలీడ్ డీల్ ఖరారు అట..!

ప్రస్తుతం థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న చిత్రాల్లో టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం “పక్కా కమర్షియల్” కూడా ఒకటి. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రంలో బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా మంచి టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 

ఇలా ఈ జూలై 1న మంచి బజ్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులకు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే రెండు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ వారు సాలిడ్ ఆఫర్ ఇచ్చి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. 

అయితే వాటిలో ఒకటి ఈ సినిమా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కి చెందిన “ఆహా” కాగా మరొక ప్రపంచ దిగ్గజ యాప్ “నెట్ ఫ్లిక్స్” వారు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ రెండిట్లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కి వస్తున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా ఈ చిత్రానికి జెక్స్ సంగీతమ్ అందించగా సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు కూడా ఈ సినిమాని నిర్మాణం వహించారు.