బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా విడుదల డేట్ ఫిక్స్..!

ప్రస్తుతం బాలయ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా అందులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా బాలకృష్ణకు 107వ సినిమాగా రూపొందుతుంది. మైత్రి మూవీ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా మరో షెడ్యూల్ కర్నూల్ లో ప్లాన్ చేశారు అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను డిసెంబర్ రెండవ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత డిసెంబర్ చివరిలో విడుదల చేయాలనుకోగా.. మళ్లీ మేకర్స్ డిసెంబర్ రెండవ తేదీన ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి త్వరలోనే సినీ బృందం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.