Vishwak Sen: పాగల్, ఫలక్ నామా దాస్, ఇటు వంటి చిత్రాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్సేన్ తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా మే ఆరో తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో ఒక ఫ్రాంక్ వీడియో చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ వీడియో తెగ వివాదాన్ని సృష్టించింది.
ఈ ప్రాంక్ వీడియో పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హెచ్ ఆర్ సి ని సంప్రదించి ఫిర్యాదు చేశాడు. అలాగే ఈ విషయం గురించి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహించి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై హీరో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నా సినిమాను బ్రతికించడం కోసం నేను సరిగా నిద్ర పోను. నా గుణమే అది నేను నిజంగానే న్యూసెన్స్ చేయలేదు.ఆ వీడియో కోసం పర్మిషన్ తీసుకున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
మొత్తం కలిపితే రెండు నిమిషాలలో ఆ వీడియో అయిపోతుంది. ఇప్పటికే నేను హిట్, పాగల్, ఫలక్ నామా దాస్, వంటి చిత్రాలలో నటించాను. ఇప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పుడు ఇలా చేసుకోవడానికి నాకేమైనా గులానా అంటూ విశ్వక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.