గుడ్ న్యూస్ : పవన్ కి నోటీసులు..కానీ కంగారు పడే పని లేదా.?

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా చాలా ప్రభావితం చేసే వ్యక్తి అని కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు అయితే సినిమాలు సహా రాజకీయాల్లో తాను బిజీగా ఉంటుండగా రీసెంట్ గా తన పొలిటికల్ టూర్ నుంచి అయితే పవన్ పేరు తెలుగు స్టేట్స్ లో సినిమా కంటే ఎక్కువగా వినిపించడం స్టార్ట్ అయ్యింది.

మరి ప్రతి రోజు కూడా పవన్ పేరు మీడియాలో వినిపిస్తుండగా ఈరోజు ఓ షాకింగ్ న్యూస్ అయితే తనపై బయటకి వచ్చింది. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూడు పెళ్లిళ్ల అంశంపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వ మహిళా కమిషన్ వారు పవన్ కి నోటీసులు పంపడం పెద్ద ఎత్తున రచ్చగా మారింది. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని లేకుండా ఓ గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది.

పవన్ ఇచ్చిన నోటీసులు కేవలం వ్యక్తిగతంగా వచ్చినవే తప్ప ఎలాంటి చట్ట బద్దమైనవి కాదని దీనితో పవన్ అయితే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదని పవన్ మరియు తన పార్టీ అధికారిక లీగల్ సభ్యులు చెబుతున్నారు. దీనితో అయితే పవన్ ఫ్యాన్స్ ఎలాంటి ఆందోళన పడే పని లేదని అంటున్నారు. సో ఇది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనేగా చెప్పాలి.