బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం రూ.150 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.160 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరలు రూ. 2100 మేర పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.69,000గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,450.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,900లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.72,900లుగా కొనసాగుతోంది.