ఎటెటో తీసుకెళ్తున్న “గాడ్ ఫాదర్” వసూళ్ల వివాదం..!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన చిత్రాల్లో అయితే మెగాస్టార్ చిరంజీవి నుంచే రెండు సినిమాలు వచ్చేసాయి. ఇక వాటిలో భారీ సినిమా ఆచార్య ఎపిక్ డిజాస్టర్ కాగా దీని తర్వాత ఎలా అయినా సక్సెస్ కొట్టాలని మళ్ళీ చిరు రీమేక్ నే నమ్ముకొని చేసిన చిత్రం గాడ్ ఫాదర్.

మరి దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ అయితే రాబట్టలేదు కానీ మొదట వారం లో మంచి వసూళ్లే నమోదు చేసింది. కానీ సినిమాకి జరిగిన బిజినెస్ పరంగా మాత్రం ఈ వసూళ్లు సరిపోవని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

మరి వీటికి సమాధానంగా అయితే నిన్న నిర్మాత ఎన్ వి ప్రసాద్ పెట్టిన ప్రెస్ మీట్ లో సినిమా అద్భుతంగా వసూళ్లు రాబడుతుందని ఇప్పటికే 60 కోట్ల షేర్ సినిమాకి వచ్చింది అని తెలిపారు. అయితే తాము సొంత రిలీజ్ చేసుకున్నాం కాబట్టి తాను  చెప్పడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే ఈ లెక్కన సొంతంగా రిలీజ్ చేసుకున్న రాధే శ్యామ్, థాంక్ యు లాంటి సినిమాలు కూడా నష్టాలు లేనట్టే కదా అని కొందరు అంటున్నారు. గాడ్ ఫాదర్ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. దీంతో అయితే గాడ్ ఫాదర్ వసూళ్ల వివాదం కొత్త టాపిక్స్ కి దారి తీసింది.