ఆ చానల్ లో కూడా కనిపించని గెటప్ శీను.. ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కాస్త పేరు సంపాదించుకుంటే చాలు కమెడియన్స్ ఒక్కసారిగా సెలబ్రిటీలగా మారడమే కాకుండా ఎన్నో సినిమా అవకాశాలను సంపాదించుకుంటూ వెండితెరపై వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకుని ఆ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఇతర చానల్స్ లో పలు కార్యక్రమాల ద్వారా బిజీ అయిన సెలబ్రిటీలు ఉన్నారు. అలాగే వెండితెరపై సందడి చేస్తున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో గుర్తింపు పొంది బయటకు వచ్చిన వారి లిస్టు చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. తాజాగా సుడిగాలి సుదీర్ గెటప్ శీను హైపర్ ఆది వంటివారు ఒకరు. హైపర్ ఆది సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమంలో కనపడకపోయినా ఇతర కార్యక్రమాల లోనూ ఇతర చానల్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే గెటప్ శ్రీను మాత్రం ఇతర చానల్స్ కానీ లేదా ఈటీవీలోనే ఇతర కార్యక్రమాలలో కానీ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం గెటప్ సీను చేతిలో ప్రస్తుతం పది సినిమాల వరకు ఉన్నాయని తెలుస్తోంది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రస్తుతం వెండితెరపై తన ఫోకస్ పెట్టినట్లు సమాచారం.బుల్లితెర కమల్ హాసన్ గా పేరు సంపాదించుకున్న గెటప్ శ్రీను ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్లే బుల్లితెరపై కనిపించడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ గెటప్ శ్రీను కమిట్ అయిన సినిమా షూటింగులు అయిపోతే అనంతరం బుల్లి తెరపై సందడి చేయొచ్చని అభిమానులు గెటప్ శ్రీను గురించి తెలియజేస్తున్నారు.