Genelia: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వారిలో నటి జెనీలియా ఒకరు. ఈమె తెలుగులో బొమ్మరిల్లు, బాయ్స్, రెడీ, ఢీ, ఆరెంజ్, హ్యాపీ, వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పెళ్లి చేసుకున్న తర్వాత జెనీలియా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈమె గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలికిరీటి రెడ్డి హీరోగా నటించిన జూనియర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 18 వ తేదీ విడుదల కాబోతోంది.
ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో జెనీలియా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి హీరోలను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఇలాంటి మంచి క్రేజ్ ,టాలెంట్ ఉన్న హీరోలతో నేను సినిమాలు చేసిందా అనే భావన కలుగుతుందని తెలిపారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా మంచి క్రేజీ సొంతం చేసుకున్నారు.
ఇలా ఈ హీరోలతో కలిసి నటించినందుకు చాలా గర్వంగా ఉందని ఈమె తెలిపారు. ఇకపోతే ఇటీవల మరణించిన కోట శ్రీనివాసరావు గురించి కూడా జెనీలియా స్పందించారు. కోటా శ్రీనివాసరావు గారితో కలిసి బొమ్మరిల్లు సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటించారు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, ఎలా నటించాలో ఆయన నాకు నేర్పించారని జెనీలియా తెలియజేశారు. అలాంటి గొప్ప నటుడి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురి అయ్యాయనని, అంత గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అంటూ జెనీలియా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
