పార్టీ అధికారంలో ఉంటే పదవులు ఉంటాయి.. పదవులు ఇస్తేనే నాయకులు వెంట ఉంటారన్నది నిజం అన్న విషయం తెలిసిందే.. ఒకవేళ అధికారం ఊడి పోయిందనుకుంటే ఆ పార్టీ నుండి ఒక్కొక్కరు దూరం అవుతారు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఘటనలు ఇవే.. ఏపీలో ఇక వైసీపీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి టీడీపీ బొమ్మ ఆడటం మానేసింది.. క్రమక్రమంగా ఆ పార్టీ నుండి ఒక్కొక్క నాయకులు అధికార పార్టీ అయినా వైసీపీలోకి జంప్ అవడం మొదలు పెట్టారు.. ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టాలంటే వలసలు అనే ఆయుధాన్ని వాడటం రాజకీయాల్లో సర్వసాధారణం అయ్యింది.. అంటే రాజకీయ నాయకులు చంచల స్వభావం గల వారు అని ఇక్కడ ప్రజలు అర్ధం చేసుకోవాలి..
ఇకపోతే టీడీపీలో అయిదేళ్ళ పాటు మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. కడప, విజయనగరం వంటి జిల్లాలకు ఇంచార్జి మంత్రిగా కూడా సేవలు అందించారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే టీడీపీలో ఆయన బిగ్ షాట్ అంటారు.. తెలుగుదేశంలో ఇంతలా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు ఈ మధ్యకాలంలో ఆ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.. అదీగాక విశాఖలో తెలుగుదేశం పార్టీ ఈ మధ్య ఆ పార్టీ ప్రకటించిన పార్లమెంట్ ప్రెసిడెంట్ల పదవులను అందుకున్న వారి చేత ప్రమాణ స్వీకారం చేయించింది..
ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా పార్టీ ఇంచార్జి హోదాలో మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తో పాటుగా, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు. కానీ ఈ కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు వంటి ముఖ్య అతిధి హాజరు కాకపోవడం మాత్రం పలు సందేహాలకు తావు ఇస్తోందట. ఈ విషయాన్ని గమనించిన వారంతా చంద్రబాబుకు ఈ బిగ్ షాట్ హ్యండిస్తున్నారా అనే డౌట్లు వ్యక్తం చేస్తున్నారట.
ఇకపోతే గంటా చాలా కాలంగా టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.. అందువల్ల రాజకీయంగానే ఈ అంశం చర్చకు తావిస్తోంది. అదీగాక గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అంటే త్వరలోనే ఈయన పార్టీ మారడం ఖాయమా? మరి చూడాలి ఏం జరుగుతుందో..